శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (14:15 IST)

కరోనా వైరస్‌తో వణుకు.. ఒక్కరోజే 15మంది మృతి.. 41కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. ఈ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. పొరుగు దేశం చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ కరోనా వైరస్ వందల మందికి సోకింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 41మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఇక హాంకాంగ్ లో అధికారులు అత్యున్నత స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. 
 
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫిబ్రవరి 9న జరగాల్సిన స్టాండర్డ్ చార్టర్డ్ హాంకాంగ్ మారథాన్ ను వాయిదా వేశారు. అంతే కాకుండా ఈ వైరస్ వల్ల ఒక్క రోజే 15మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
 
ఇక ఈ వైరస్ ఆ పాముల మాంసం తినడం ద్వారా మనుషుల్లోకి సంక్రమించినట్టు ఇప్పటికే చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ తమ అధ్యయనంలో వెల్లడించింది. అంతే కాకుండా గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని సైంటిస్టులు తేల్చారు. పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూడగా, ఒకేలా ఉన్నట్టు గుర్తించారు.