బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (17:49 IST)

వాట్సాప్‌లో డార్క్ మోడ్.. హమ్మయ్య ఇక కంటికి మేలే

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌లో డార్క్ మోడ్ రాబోతోంది. ఫలితంగా కళ్లు భద్రంగా వుంటాయని సంస్థ ప్రకటించింది. రాత్రవేళ్లలో కళ్లకు శ్రమ తెలియకుండా చేసేందుకు వాట్సాప్ డార్క్‌మోడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. 
 
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆండ్రాయిడ్ వెర్షన్ రెడీ అయ్యిందని.. ఐవోఎస్ వెర్షన్ కూడా సిద్ధమవుతోందని వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లలో కొందరికి ఇప్పటికే డార్క్ మోడ్ అందుబాటులోకి వచ్చిందని బ్రిటన్ చెందిన ఓ వెబ్ సైట్ పేర్కొంది. 
 
డార్క్ మోడ్ వల్ల ప్రయోజనాలు.. 
* కంటికి మేలు చేకూరుతుంది. 
* కంటికి అలసట వుండదు. 
* సాధారణంగా ఇంటర్నెట్‌లో సమాచారమంతా తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నల్లని అక్షరాల్లో ఉంటుంది.
 
తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నల్లని అక్షరాలతో కంటికి విపరీతమైన శ్రమ ఏర్పడుతుంది. కానీ డార్క్ మోడ్ ద్వారా ఆ ఇబ్బంది వుండదు. ఈ డార్క్ మోడ్ ద్వారా నల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల రాత్రివేళ వాట్సాప్‌ను ఉపయోగించే వారి కళ్లకు శ్రమ తగ్గుతుందని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.