మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (14:13 IST)

రెడ్ మీ ఫోన్ పేలిపోయింది.. ఎక్కడ?

మొబైల్ మార్కెట్‌లో పెను సంచలనంగా మారిన రెడ్ మీ ఫోన్ పేలిపోయింది. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజినగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది.

మొబైల్ మార్కెట్‌లో పెను సంచలనంగా మారిన రెడ్ మీ ఫోన్ పేలిపోయింది. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజినగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. కాలనీకి చెందిన మణి తన రెడ్‌ మీ నోట్‌ ఫోర్‌ ఫోన్‌ జేబులో వేడి అవుతోందని పక్కన పెడుతుండగా ఫోన్‌ నుంచి పొగలు వచ్చాయి. 
 
దీంతో అప్రమత్తమైన యువకుడు దూరంగా వెళ్లిపోగానే ఫోన్‌ పేలిపోయింది. ఈ ఫోన్‌ను ఇటీవలే కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో పలుచోట్ల ఫోన్‌లు పేలాయనే విషయాన్ని వాట్సప్‌లో, పత్రికల్లో చూసిన వినియోగదారులు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
చైనాకు చెందిన షియోమీ సంస్థ తాజాగా రెడ్ మీ 4, రెడ్ మీ 5ఏ ఫోన్లను విడుదల చేయగా, ఇవి హాట్ కేకుల్లా అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. వీటిలో ఒకటైన రెడ్ మీ 4 నోట్ పేలిపోయింది. దీంతో ఈ ఫోన్ భద్రతా ప్రమాణాలపై పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.