సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (12:49 IST)

భిక్షాటన చేసే బాలికపై.. బెలూన్లు అమ్మే అబ్బాయి అత్యాచారం..

rape
లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదేళ్ల బాలికపై తొమ్మిదేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మైనర్ బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. 
 
వివరాల్లోకి వెళితే.. అర్జున్‌గంజ్ సిగ్నల్‌ల వద్ద బాలిక భిక్షాటన చేసేదని.. అబ్బాయి... సుశాంత్ గోల్ఫ్ సిటీ సమీపంలో నివసిస్తూ వీధుల్లో బెలూన్‌లు విక్రయిస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరికీ ఒకరికొకరు పరిచయమని పోలీసులు తెలిపారు. 
 
మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలో నిర్వహించిన జాతరకు వీళ్లు వచ్చారు. "తర్వాత, బాలుడు బాలికను స్టేడియం వెనుక ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. 
 
అమ్మాయి తన తండ్రికి సమాచారం అందించింది. ఆపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంఘటన తర్వాత నిందితుడు పారిపోయాడు. ప్రస్తుతం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. 
 
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 83 ప్రకారం, 7- 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ బాలుడు నేరానికి పాల్పడితే, పిల్లల మానసిక సామర్థ్యాన్ని బట్టి శిక్ష వుంటుంది.