సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (22:00 IST)

52 ఏళ్ళ యూపీ సీఎం కాళ్ళుపై పడి నమస్కరించిన రజినీకాంత్

Rajinikanth
Rajinikanth
52 ఏళ్ళ యూపీ సీఎం కాళ్ళుపై పడి సూపర్ స్టార్ రజినీకాంత్ మొక్కారు.  జైలర్ రిలీజ్ తర్వాత  హిమాలయాలకు స్పిరిట్చువల్ టూర్‌కు వెళ్లిన రజినీకాంత్ తన కొత్త సినిమా జైలర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్ యోగిలు, గురువులు, బాబాలను సేవించుకున్నారు. హిమాలయా టూరుకు వెళ్లి అటు నుంచి అటే యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను కలవడానికి వెళ్లారు. 
 
లక్నోకు వెళ్లిన 72 ఏళ్ల రజినీకాంత్ తనకంటే చాలా చిన్నవాడైన యూపీ సీఎం యోగి కాళ్లను మొక్కారు. యోగి ఇంటి బయట వేచి ఉన్న ఆయన పాదాలకు నమస్కరించారు. అయితే యోగి ఒక సన్యాసి, ఆధ్యాత్మిక గురువు కావడంతోనే అలా రజినీ చేసి ఉండొచ్చు. 
 
ఆధ్యాత్మిక భావాలు ఉన్న రజినీ యోగిని ఆ కోణంలోనే చూసే ఆశీర్వాదం తీసుకొని ఉండొచ్చు. అయితే ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చాలా మంది ఈ చర్యను తప్పుపట్టగా.. కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.