శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (16:37 IST)

అమెరికా నుంచి తెలుగు విద్యార్ధులు వెనక్కి-ఆరా తీసిన సీఎం జగన్

ys jagan
అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తమను అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించేశారని విద్యార్థులు వాపోయారు. ఇంకా పత్రాలన్నీ సరిగ్గా వున్నప్పటికీ... కొద్దిసేపు విచారించిన తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండా స్వదేశానికి పంపించారని ఆరోపించారు.
 
అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాల్లో దిగిన విద్యార్థులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలు సేకరించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల శాఖ సాయంతో విద్యార్థులకు సహకారం అందించాలన్నారు.