కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఒక్క ఎలుక కోసం రూ.45వేలు ఖర్చు
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా రైల్వే శాఖ అధికారులు ఎలుకల్ని పట్టుకోవటానికి భారీగా ఖర్చు చేశారు. దీని ప్రకారం ఒక్క ఎలుకలను పట్టుకోవడానికి దాదాపు రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నార్త్ రైల్వే లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.5 లక్షలు ఖర్చు పెట్టిందని రైల్వే శాఖ తెలిపింది. ఇంత ఖర్చు చేసి మొత్తం 168 ఎలుకలు పట్టించారు. కానీ ఎలుకల చేత నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదు.