సంబంధిత వార్తలు
- ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? తెచ్చేవారు తింటున్నారేమో చూడండి..
- నాతో రోజూ మాట్లాడేవాడు.. ఓసారి నడిరోడ్డుపై..?: శిల్పాశెట్టి
- మాది టెన్త్ క్లాస్ ప్రేమ... అయిష్టంగా భర్తతో కాపురం చేస్తున్నా.. ప్రియుడే ముఖ్యమంటూ సూసైడ్
- మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. ఎందుకు?
- 'ఆర్ఎక్స్ 100' ప్రభావం.. పెట్రోల్ ఒకరిపై ఒకరు పోసుకుని నిప్పంటించుకున్నారుయ...
బిస్కెట్ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు
యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది.
యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం తల్లి తన కుమారునికి బిస్కెట్ కొనుక్కోవడానికి 2 రూపాయలు ఇవ్వలేదని కోపగించుకున్న ఆ బాలుడు పాఠశాలకు వెళ్లేటప్పుడు తన తల్లి చున్నీని తీసుకుని వెళ్లాడు. ఆ చున్నీతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు... ఆత్మహత్య చేసుకున్న బాలుడిని చంద్రభాన్‌గా గుర్తించారు. అయితే చంద్రభాన్ స్కూల్‌కి బయలుదేరే ముందు తల్లి అతడికి టీ ఇచ్చి బిస్కెట్ ఇవ్వలేదని, అందువలన బిస్కెట్ కోసం 2 రూపాయలు ఇవ్వాల్సిందేనని మొండికేశాడు. చివరకు ఆమె చంద్రభాన్‌ను కొట్టడంతో ఆమె చున్నీ తీసుకుని స్కూలుకు బయలుదేరాడు. ఇక సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు.
గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో చంద్రభాన్ గ్రామస్తులకు కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించి, దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
