1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Actor Vijay drawing Whistle Muggu in Perambur

పెరంబూరులో విజిల్ ముగ్గులు వేసుకుంటున్న నటుడు విజయ్

Actor Thalapathy Vijay drawing Whistle Muggu in Perambur Chennai
టీవీకె పార్టీ చీఫ్ విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరులో ఈరోజు తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వాకిలిలో తమ పార్టీ గుర్తు విజిల్ ముగ్గును వేసారు. ఈ ముగ్గులకు రంగులు వేసేందుకు పార్టీ మహిళా కార్యకర్తలు పోటీపడ్డారు. శనివారం నాడు పెరంబూరులోని గడప గడపకూ పర్యటన చేయనున్నట్లు పార్టీ ప్రతనిధులు తెలియజేస్తున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే తమిళ నటుడు విజయ్ పార్టీ విజయబావుంటా ఎగురవేసేటట్లే వుంది. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(TVK) ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఏప్రిల్ 2026 నాటికి అంటే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయానికి విజయ్ విజయావకాశాలను విశ్లేషిస్తే, అక్కడ పరిస్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. విజయ్ విజయావకాశాలపై రాజకీయ విశ్లేషకులు చెబుతున్న కొన్ని అంశాలను పరిశీలిద్దాము.
 
మొదటిది యువత మరియు ఫ్యాన్ బేస్(The Youth Power). విజయ్‌కు తమిళనాట ఉన్న అతిపెద్ద బలం యువత. 18-25 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లలో మెజారిటీ విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పాత పార్టీలైన DMK, AIADMKల కంటే కొత్త మార్పును కోరుకునే యువతకు TVK ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. విజయ్ తన విజయ్ మక్కల్ ఇయక్కం(VMI) సేవా సంస్థను పార్టీ క్యాడర్‌గా మార్చడంలో సక్సెస్ అయ్యారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఆయనకు బలమైన నెట్‌వర్క్ ఉంది.
 
రాజకీయ శూన్యత (Political Vacuum)
జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజ నేతలు లేకపోవడంతో తమిళ రాజకీయాల్లో ఒక శూన్యత ఏర్పడింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న DMKపై సహజంగా ఉండే వ్యతిరేకత (Anti-incumbency) విజయ్‌కు కలిసి రావచ్చు.
 
AIADMK బలహీనత: ప్రధాన ప్రతిపక్షం AIADMK నాయకత్వ సమస్యలతో సతమతమవుతుండటం విజయ్‌కు మూడవ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు మార్గం సుగమం చేస్తోంది. విజయ్ తన పార్టీని జాతి, మతాతీత సామాజిక న్యాయ మార్గంలో నడిపిస్తానని ప్రకటించారు. ద్రవిడ సిద్ధాంతాలను గౌరవిస్తూనే, అవినీతి రహిత పాలనను ఆయన ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. ఇది చదువుకున్న మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటోంది.
 
ఎదురయ్యే ప్రధాన సవాళ్లు
విజయావకాశాలు ఉన్నప్పటికీ, ఆయన ముందు కొన్ని గట్టి అడ్డంకులు కూడా ఉన్నాయి. కూటమి సమీకరణాలు ప్రధాన అంశంగా వుంది. తమిళనాడులో ఒంటరిగా గెలవడం చాలా కష్టం. DMKకి బలమైన మిత్రపక్షాలు (Congress, Left, VCK) ఉన్నాయి. విజయ్ ఎవరితో జతకడతారనేది ఆయన విజయాన్ని డిసైడ్ చేస్తుంది.
 
ఓట్ల చీలిక: విజయ్‌కి పడే ఓట్లు ప్రధానంగా AIADMK లేదా చిన్న పార్టీలైన నామ్ తమిళర్(సీమాన్) నుంచి చీలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల పరోక్షంగా DMKకి లాభం జరిగే ప్రమాదం కూడా ఉంది. ఏప్రిల్ 2026 సర్వేల ప్రకారం, విజయ్ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
 
ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే (Hung Assembly), విజయ్ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం కావచ్చు. కనీసం 15 శాతం నుండి 20 శాతం ఓటు బ్యాంకును ఆయన సాధించగలిగితే, అది తమిళ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు అవుతుంది.
 
విజయ్‌కు కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే, సినిమా గ్లామర్ ఓట్లుగా మారుతుందా లేదా అనేది ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. 2026 ఎన్నికలు తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్నట్లుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద తమిళనాడులో దాదాపు ఎక్కువమంది నోట వినిపిస్తున్న మాట మాత్రం ఈసారి ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయం సాధిస్తుందని గట్టిగా చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాము.
About Writer
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రియురాలి కొడుకును చంపేసిన ప్రియుడు.. భర్తను హత్య చేయించిన భార్య.. ఎక్కడ?