తెలంగాణలో అమేజాన్ డేటా సెంటర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్: విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న నాలుగో బ్యాచ్
తెలంగాణలోని శంషాబాద్ వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో.. అమెజాన్ డేటా సెంటర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ నాలుగో బ్యాచ్‌కు చెందిన 51 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం నాలుగో ఏట అడుగుపెట్టిన ఈ ప్రోగ్రామ్.. గత మూడేళ్లలో 200 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో తమ కెరీర్‌ను నిర్మించుకోవడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను ఇది విద్యార్థులకు అందిస్తుంది. తద్వారా భారతదేశంలో నానాటికీ పెరుగుతున్న క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిపుణుల డిమాండ్‌ను తీర్చడంలో అండగా నిలుస్తోంది. ఈ గ్రాడ్యుయేషన్ వేడుకకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కొవూరి పవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్, జపాన్ మరియు చైనా విభాగాల డేటా సెంటర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీ సజీ పి.కె. మాట్లాడుతూ.. భారతదేశ వ్యాప్తంగా క్లౌడ్ మరియు ఏఐ సేవల వినియోగం శరవేగంగా పెరుగుతున్నందున, ఈ టెక్నాలజీలకు వెన్నెముకగా నిలిచే డేటా సెంటర్లను నిర్వహించగల అత్యుత్తమ నైపుణ్యాలున్న నిపుణులను తయారుచేయడం ప్రస్తుతం ఎంతో అవసరం అని అన్నారు. మా డేటా సెంటర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ పొందిన ఈ బ్యాచ్ సాధించిన విజయాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఈ గ్రాడ్యుయేట్లు మన పరిశ్రమకు భవిష్యత్తు లాంటివారు. వీరు తమ నైపుణ్యాలతో సరికొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ.. ఈ ప్రాంతంలో రాబోయే తరపు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఈ 51 మంది విద్యార్థులు.. క్రిటికల్ ఫెసిలిటీస్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, అలాగే క్రిటికల్ కంప్యూట్ ఆపరేషన్స్ విభాగాల్లో సమగ్ర శిక్షణను అందుకున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ఆపరేషన్స్ బృందం భాగస్వామ్యంతో రూపొందించబడిన ఈ ప్రోగ్రామ్.. క్లౌడ్ డేటా సెంటర్ల నిర్వహణకు సంబంధించి విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.
భారతదేశంలో ముంబై, హైదరాబాద్ నగరాల్లో AWS రెండు క్లౌడ్ డేటా సెంటర్ రీజియన్‌లను నిర్వహిస్తోంది. అలాగే 2030 నాటికి దేశంలోని క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఏకంగా 12.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. భారతదేశంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెడుతున్న ఈ పెట్టుబడులు.. సాంకేతిక నైపుణ్యాల కల్పనతో సహా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
భారతదేశంలో యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలన్న అమెజాన్ విస్తృత లక్ష్యంలో ఈ డేటా సెంటర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కూడా ఒక భాగం. AWS స్కిల్ బిల్డర్, AWS ఎడ్యుకేట్, మరియు AWS రీ/స్టార్ట్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా 2017 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా అభ్యర్థులకు AWS క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చింది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారికి క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలను అందించడం ద్వారా.. టెక్నాలజీ రంగంలో వారు అద్భుతమైన కెరీర్ నిర్మించుకునేలా సహాయపడటమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్.. రాష్ట్రంలోని డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంతో పాటు యువతకు టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోంది.
