1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Bengali actor Srabanti Chatterjee quits BJP

బీజేపీకి గుడ్‌బై చెప్పిన బెంగాలీ నటి స్రవంతి ఛటర్జీ

Bengali
Srabanti Chatterjee
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అక్కడ పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి ఇప్పటికే చేరగా.. తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 
 
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 2న బీజేపీలో చేరిన ఆమె.. ఇప్పుడు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిపై బీజేపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని.. కనీస ప్రణాళికలు కూడా లేవని ఆరోపించిన స్రవంతి ఛటర్టీ.. అందుకే తాను బీజేపీకి రాజానామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 
 
ఇక, ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు టీఎంసీలో చేరిన నేపథ్యంలో.. ఇప్పుడు స్రవంతి ఛటర్జీ కూడీ తృణమూల్‌ పార్టీలోనే చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బెహలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన స్రవంతి ఛటర్జీ.. ఆ ఎన్నికల్లో టీఎంసీ కీలక నేత పార్ధ ఛటర్జీ చేతిలో ఓటమిపాలయ్యారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపీలో భారీ వర్షాలు... స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు