సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2021 : గర్జించిన ఢిల్లీ క్యాపిటల్స్ .. చతికిలపడిన చెన్నై సూపర్ కింగ్స్
- ఆమ్లెట్ దొంగిలించి తిన్నాడు.. అంతే.. చితక్కొట్టారు.. వ్యక్తి మృతి
- ప్రేమించలేదని యువతిని పొలంలోకి లాక్కెళ్లి తాళి కట్టి ఆ తర్వాత...
- మ్యూజిక్ లవర్స్ కోసం స్పెషల్ కంటెస్ట్ ని ప్రకటించిన రెహమాన్
- భార్యపై అనుమానం... నాకు పుట్టలేదనీ కన్నబిడ్డ ప్రాణాలు తీసిన కసాయి తండ్రి
చెన్నైలో దారుణం... ప్రియురాలి సజీవదహనం
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో ఆమెను ముత్తు అనే వ్యక్తి బస్టాండ్‌లోనే సజీవ దహనం చేశాడు. చెన్నైలో రోజువారీ కార్మికుడైన ముత్తు.. శాంతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరు బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపైనే జీవించేవారు.
అయితే కోయంబేడు మార్కెట్‌లో పనిచేసే మరో వ్యక్తితో శాంతి సన్నిహితంగా ఉంటోంది. అది ఇష్టంలేని ముత్తు సదరు వ్యక్తితో తెగదెంపులు చేసుకోవాలని శాంతిని హెచ్చరించాడు.
ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్న ముత్తు.. శాంతి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి ఆమెకు నిప్పంటించాడు. అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రయాణికులు, స్థానికులు ఆ మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఇరువురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
