సంబంధిత వార్తలు
- నలుగురు నిన్నే చూసేలా మిడ్డీస్ ధరించు.. లో దుస్తుల్లో పేకాట ఆడుదాం... భార్యకు భర్త టార్చర్
- తల్లితో సంబంధం.. ఆపై కుమార్తెపై కన్ను... పెళ్లి చేయాలంటూ ఖాకీ ఒత్తిడి
- పిల్లలు పుట్టలేదంటారు కానీ... అసలు ఇవి తింటున్నారో లేదో?
- పెళ్లయిన యేడాదికే భర్త రంకుబాగోతం... అమ్మా సారీ, నీకు భారం కాకూడదనీ...
- బహుశా... శృంగారంలో పాల్గొనే జంటకు ఈ 5 పాయింట్లు తెలియకపోవచ్చు...
వృద్ధ జంట సూసైడ్... ఎందుకు?
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె మరో కులం వ్యక్తితో లేచిపోయిందనీ... ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే,
కోయంబత్తూరు జిల్లా పొల్లాచికి చెందిన ఓ వృద్ధ జంటకు 24 యేళ్ళ ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఈమె తన కాలేజీలో చదివే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను వేరే కులానికి చెందిన యువకుడు కావడంతో పెళ్ళికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పైగా, ఆ యువకుడుని మరిచిపోవాలని సూచించారు. అయినప్పటికీ.. ఆ యువతి ప్రియుడుని మరిచిపోలేక అతనితో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుంది.
ఒక్కగానుఒక్క కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికిలోనయ్యారు. తమ పరువు పోయిందని భావించిన ఆ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్ చేసి చెప్పి ఇద్దరు పురుగుల మందు తాగారు. బంధువులు ఇంటికి వచ్చి చూసే సరికి వారు ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడివున్నారు.
