సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 అక్టోబరు 2018 (17:46 IST)

పెళ్లయిన యేడాదికే భర్త రంకుబాగోతం... అమ్మా సారీ, నీకు భారం కాకూడదనీ...

పెళ్లయిన యేడాదికే కట్టుకున్న భర్త చీకటి కోణంతో పాటు... రంకుబాగోతం తెలిసింది. దీంతో ఆ వివాహిత అమ్మా క్షమించు అంటూ లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సుల్తానాబాద్‌కు చెందిన శ్రావణి(26)కి 11 నెలల క్రితం శ్రావణి వివాహం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన తంగళ్లపల్లి రాజేష్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఐదు లక్షల నగదు, ఇతర కట్నకానుకలు అప్పగించారు.
 
నెల రోజుల వరకు వీరి కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత రాజేష్‌ ఇద్దరు యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని శ్రావణి తెలుసుకుని నిలదీసింది. దీంతో శ్రావణికి చిత్రహింసలు మొదలయ్యాయి. మరో వైపు అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధించారు. 
 
చివరకు ఆమెను పుట్టింటికి పంపించారు. ఈ బాధలు భరించలేక తల్లికి భారం కాకూడదని శ్రావణి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి హరిప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రావణి భర్త రాజేష్‌, అత్తమామలు, ఆడపడుచుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
శ్రావణి బలవన్మరణానికి పాల్పడే ముందు సూసైడ్ లేఖను రాసిపెట్టింది. 'అమ్మా నన్ను క్షమించు నీకు భారం కాకూడదని ఈ తనువు చాలిస్తున్నా'  అంటూ సుసైడ్‌ నోట్‌లో పేర్కొంది. మరోవైపు జిల్లా కలెక్టర్‌ పేరిట మరో లేఖ రాసింది. తన చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రాధేయపడింది.