గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:46 IST)

నేను సరే.. నా ఫ్రెండ్‌తోనూ సంబంధం పెట్టుకో... నో చెప్పిన మహిళను చంపేసిన వాచ్‌మెన్

ఆ మహిళతో అప్పటికే అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితుడుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ వేధించాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో అత్యంత కిరాతకంగా ఆ మహిళను చంపేశాడో వాచ్‌మెన్.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్‌లో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్ ప్రాంతానికి చెందిన సుశీల్(40) వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈయన వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే 42 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సుశీల్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు.
 
దీంతో ఈనెల ఆరో తేదీన ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి... తమ కోరిక తీర్చమని బలవంత చేశారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఆమెపై దాడి చేసి గొంతు పిసికి చంపేశారు. ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.