మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (10:34 IST)

లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకున్నారు.. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి..?

24 ఏళ్ల మహిళ ముగ్గురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన బుధానా జిల్లా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

24 ఏళ్ల మహిళ ముగ్గురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన బుధానా జిల్లా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల మహిళ బుధానాలో పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుంది. 
 
ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆమె దగ్గరికి వెళ్లి.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి బలవంతంగా ఎక్కించుకున్నారు. ఆపై సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతేగాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తామంటూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.