పకోడీ కొట్టు పెట్టుకుని.... రూ.60లక్షల పన్ను కట్టిన వ్యాపారి..
వీధిలో చిన్న కొట్టుగా ప్రారంభమైన పకోడీల వ్యాపారం.. కోట్లకు పడగలెత్తింది. ఆ వ్యాపారి భారీగా పన్ను కట్టాడు. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.60లక్షల పన్ను చెల్లించాడు
వీధిలో చిన్న కొట్టుగా ప్రారంభమైన పకోడీల వ్యాపారం.. కోట్లకు పడగలెత్తింది. ఆ వ్యాపారి భారీగా పన్ను కట్టాడు. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.60లక్షల పన్ను చెల్లించాడు.
అతి తక్కువ పన్ను చెల్లిస్తుండటంతో అనుమానం వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తే అసలు బాగోతం బయటపడింది. దొంగ రికార్డులతో పన్నును భారీగా ఎగ్గొడుతున్నట్టు తేలింది. దీంతో అతడి నుంచి భారీగా పన్ను కట్టించుకున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పన్నా సింగ్ అనే వ్యక్తి 1952లో వీధిలో చిన్న పకోడీ కొట్టు పెట్టాడు. అది క్రమంగా పెరిగి పెద్ద వ్యాపారంగా మారింది. రాజకీయ నాయకులు, అధికారులు కస్టమర్లుగా మారిపోవడంతో.. కోట్లాది రూపాయలు సంపాదించినా.. పన్ను మాత్రం తక్కువగా చెల్లించాడు
దీంతో అనుమానం వచ్చిన అధికారులు దాడి చేసి రికార్డులు పరిశీలించారు. దీంతో పన్నాసింగ్ పన్నును భారీగా ఎగ్గొడుతున్నట్టు తేలింది. అంతే అతడితో రూ.60లక్షలు భారీగా పన్ను కట్టించుకున్నారు.