శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 26 మే 2018 (12:07 IST)

బల్లీ పకోడీ చూశారా? ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చూస్తే.. చచ్చిన బల్లి?

ఆనియన్ పకోడీ టేస్ట్ చేసివుంటాం. అయితే బల్లీ పకోడీ చూశారా? అబ్బే యాక్ అంటున్నారు.. కదూ.. అవును.. అదే జరిగింది.. హైదరాబాదులోని రామంతాపూర్‌లో. వివరాల్లోకి వెళితే, పల్లీ పకోడీ తిందామని ప్యాకెట్ ఓపెన్ చేస్

ఆనియన్ పకోడీ టేస్ట్ చేసివుంటాం. అయితే బల్లీ పకోడీ చూశారా? అబ్బే యాక్ అంటున్నారు.. కదూ.. అవును.. అదే జరిగింది.. హైదరాబాదులోని రామంతాపూర్‌లో. వివరాల్లోకి వెళితే, పల్లీ పకోడీ తిందామని ప్యాకెట్ ఓపెన్ చేస్తే.. అందులో చచ్చిపోయిన బల్లి కనిపించడంతో కస్టమర్ ఆ కవర్ కిందపడేసి వాంతులు చేసుకున్నాడు. 
 
దూరదర్శన్ కేంద్రం ఎదురుగా ఉన్న శ్రీసాయి గణేష్ హోటల్, చిప్స్ దుకాణంలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి పల్లీ పకోడీల ప్యాకెట్‌ని శుక్రవారం కొనుగోలు చేశాడు. తిందామని ఆ ప్యాకెట్ విప్పగా చచ్చిన బల్లి ఉంది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు షాపుకెళ్తే.. నిర్వాహకులు రంజిత్ సింగ్‌ మాటలను పట్టించుకోలేదు. అంతే ఇక బాధిత వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన శానిటేషన్ అధికారులు ఆ దుకాణాన్ని పరిశీలించారు. ఆ షాపులో తినుబండారాల ప్యాకెట్లపై తయారీ తేదీలు లేకపోవడాన్ని గమనించారు. షాపు యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు.