బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (13:48 IST)

పకోడీ తయారీ మంచి పనే.. యువత రెస్టారెంట్లు పెట్టేస్తారు: ఆనందీ బెన్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పకోడీ వ్యాఖ్యలను గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ సమర్థించే పనిలో పడ్డారు. పకోడీలు తయారు చేసే వ్యక్తి రోజుకు రూ.200 వరకు సంపాదిస్తుండటాన్ని ప్రధాని గ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పకోడీ వ్యాఖ్యలను గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ సమర్థించే పనిలో పడ్డారు. పకోడీలు తయారు చేసే వ్యక్తి రోజుకు రూ.200 వరకు సంపాదిస్తుండటాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఇందులో తప్పేమీ లేదని ఆనందీ బెన్ అన్నారు. పకోడీల తయారీ ఓ నైపుణ్యం అని., భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యాపారాల ప్రారంభానికి అది తొలిమెట్టు అంటూ చెప్పుకొచ్చారు. 
 
పకోడీలు తయారు చేసి అమ్మేవారు రెండేళ్ల తర్వాత హోటల్‌కు సప్లై చేసేవారుగా ఎదుగుతారు. ఆపై సొంతంగా రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించే స్థాయికి ఎదిగిపోతారని ఆనందీ బెన్ తెలిపారు. పకోడీ తయారీ ఓ మంచి పనికాదని భావించవద్దునని.. మంచి పకోడా లేదా రుచికరమైన పకోడా చేయకపోతే కస్టమర్లు రారని మోదీ పకోడా వ్యాఖ్యలకు ఆమె వివరణ ఇచ్చారు.
 
అయితే ప్రధాని పకోడీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సోషల్ మీడియా వేదికగా పకోడా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పకోడా విక్రేతల తర్వాత ప్రభుత్వం బిచ్చగాళ్లను కూడా ఉద్యోగులుగానే పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం వుండదంటూ ఫైర్ అయ్యారు. అయితే పకోడా విక్రేతలను బిచ్చగాళ్లతో పోల్చడం సరికాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు.