1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Elderly man drowned while crossing river by catching buffalo tail

గేదే తోక పట్టుకున్నాడు.. నదిని దాటాడు.. కానీ ప్రవాహం ముంచేసింది..

గేదె తోక పట్టుకుని నదిని దాటేందుకు ఓ వృద్ధుకు ప్రయత్నించాడు. అలా కాసేపు నదిని దాటుకుంటూ వచ్చాడు. కానీ నదీ ప్రవాహం అధికం కావడంతో గేదే తోకను విడిచిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లో

buffalo tail
గేదె తోక పట్టుకుని నదిని దాటేందుకు ఓ వృద్ధుకు ప్రయత్నించాడు. అలా కాసేపు నదిని దాటుకుంటూ వచ్చాడు. కానీ నదీ ప్రవాహం అధికం కావడంతో గేదే తోకను విడిచిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గండ్‌రౌలీ గ్రామనికి చెందిన లాలారామ్ శర్మ తన గేదెను తీసుకుని బేస్లీ నదిని దాటుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా నదీ ప్రవాహ వేగం పెరగడంతో ఆ ఉధృతికి తట్టుకులేని శర్మ గేదె తోకని జారవిడిచాడు. దీంతో అతడు ఆ నదిలో మునిగిపోయాడు. 
 
ఎంతకీ లాలారామ్ శర్మ ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శర్మ నదిలో మునిగిపోయి ఉండవచ్చని వారికి అనుమానం రావడంతో సహాయక సిబ్బందికి సమాచారం అందించారు. గాలింపు చర్యల అనంతరం సహాయక బృందానికి 17 గంటల తరువాత ఆ వృద్ధుడి మృతదేహాన్ని నది నుంచి వెలికి తీశారు.
About Writer
selvi