సంబంధిత వార్తలు
- నేతాజీ జన్మస్థలాన్ని చాలాసార్లు సందర్శించా: బిశ్వభూషణ్
- వ్యవసాయం ప్రధానంగా మరిన్ని పరిశోధనలు జరగాలి: ఉపరాష్ట్రపతి
- మరదలితో బెడ్రూంలో రసపట్టులో బావ.. కళ్ళారా చూసిన మామ ఏంచేశాడంటే?
- బ్రియాంట్ మృతి: కోహ్లీ, రోహిత్, కేటీఆర్ దిగ్భ్రాంతి, ట్రంప్, ఒబామా సైతం.....
- మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఏది? పార్శిల్స్లో కూడా...
నేను చాలా సార్లు కట్టుబాట్లను ధిక్కరించా: సన్నీలియోన్
కావాలని చేసినా, పొరబాటున చేసినా చాలాసార్లు సమాజం కట్టుబాట్లను తాను ధిక్కరించానని ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ వెల్లడించారు.
ప్రముఖ మ్యూజిక్ సంస్థ గానా నిర్వహించిన ‘కన్ఫెషన్స్ విత్ సన్నీ లియోన్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను చాలా సార్లు కట్టుబాట్లను ధిక్కరించాను.
తెలిసో తెలియకో అలా చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడూ నా కుటుంబానికి, నాకు ఉపయోగకరమైన నిర్ణయాలే తీసుకున్నాను. కచ్చితంగా నమ్మిన సిద్ధాంతాలనే అమలుచేశాను’ అని సన్నీ వివరించారు.
తను ఈ మాటలు చెప్పడం ద్వారా చాలామందికి ఇటువంటి విషయాలు బయటకు చెప్పే ధైర్యం వస్తుందనే ఉద్దేశ్యంతోనే, తను ఈ విషయాలు వెల్లడించినట్లు ఆమె స్పష్టంచేశారు.
తాను చేసే పనులను చాలామంది తప్పుబడుతుంటారని, అలా చేయడం పెద్ద కష్టం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు విషయం తెలియకుండా ఎదుటి వారు చేసేది తప్పో ఒప్పో మనం ఎలా చెప్తాం? అని సూటిగా ప్రశ్నించారు.
తర్వాతి కథనం
