1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Nitish Kumar resigns; Samrat Choudhary set to become next Bihar CM

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

nitish kumar
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోన లోక్‌భవన్‌కు చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. అంతకుందు ఆయన తన చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మంత్రివర్గ రద్దు విషయాన్ని సహచరులకు తెలియజేశారు. ఆ తర్వాత లోక్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు.
 
దీంతో బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్‌ చౌధరీ కొత్త సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. కేంద్ర సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. కాగా, ఇటీవల రాజ్యసభ సభ్యుడుగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. నితీశ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక పదవిని అప్పగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ఒక ఇంటికి రూ.10 వేలు, మూడు పండుగలకు మూడు సిలిండర్లు ఫ్రీ... బీజేపీ మేనిఫెస్టో 
 
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలతో పాటు చిన్నాచితక పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా మేనిఫెస్టోను వెల్లడించింది. ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా అర్హులైన మహిళలకు నెలకు రూ.2 వేలు పింఛన్, ప్రతి ఇంటికి రూ.10 వేలు నగదు, సంక్రాంతి, దీపావళి, తమిళ ఉగాది పండుగలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో కేంద్ర మంత్రి, ఆ పార్టీ జాతీయ పూర్వ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలోని హామీలను పరిశీలిస్తే... 
 
ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు రూ.2,000 ఆర్థికసాయం
ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు (పొంగల్‌, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం రోజున)
ఆర్థికసాయం కింద ప్రతి ఇంటికి ఒకేసారి రూ.10,000
మహిళలకు ఇ-స్కూటర్ల కొనుగోలుపై రూ.25,000 రాయితీ
జల్లికట్టు ఎద్దులను పెంచేవారికి నెలకు రూ.2,000 సాయం
జల్లికట్టులో పోటీపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్-గ్రేషియా
మహిళలకు రూ.8000 విలువైన కూపన్‌ (టీవీ వంటి గృహోపకరణాలు కొనుక్కోవడం లేదా మార్చుకోవడానికి) 
తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు 
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో స్థానిక నివాసితుల కోసం ప్రతిరోజూ రెండు గంటల దర్శన సమయాల కేటాయింపు వంటి హామీలను ప్రకటించారు. 
About Writer
ఠాగూర్