1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Rajya sabha schedule released

రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్.. పోలింగ్ జరిగిన రోజే కౌంటింగ్

Rajya sabha
ఏప్రిల్‌లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు.
 
అందులో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేది. మార్చి 26న పోలింగ్ జరుగనుండగా... అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.
 
ఆంధ్ర నుంచి ఎమ్.ఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి... తెలంగాణ నుంచి కేవీపీ, గరికపాటి మోహన్ రావు రిటైర్ కానున్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
దత్తత తీసుకున్న బాలికను చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు