శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (07:55 IST)

ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ షెడ్యూల్ విడుదల

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్‌ను ప్రకటించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు.

జనవరి 1 క్వాలిఫైయింగ్ తేదీకి అనుగుణంగా మోడిఫైడ్ షెడ్యూల్‌ను విడుదల చేయడం జరిగిందని ఆ ప్రకారం ఈ నెల 23న ఇంటిగ్రేటెడ్ డ్రాప్టు ఎలక్టోరల్ రోల్ పబ్లికేషన్ చేయడం జరగుతుందని తెలిపారు. డిశంబరు 23 నుండి జనవరి 22వ తేదీ వరకూ ముసాయిదా ఓటర్ల జాబితా ( డ్రాప్టు ఎలక్టోరల్ రోల్)పై క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు.

ఆ విధంగా వచ్చిన క్లెయమ్లు మరియు అభ్యంతరాలను వచ్చే ఫిబ్రవరి 3వ తేది నాటికి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 11వ తేదీన సప్లిమెంట్స్ సిద్ధం చేయడం జరుగుతుందని, తదుపరి ఫిబ్రవరి 14వతేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ వెల్లడించారు.