ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 16 డిశెంబరు 2019 (20:26 IST)

సారీ.. నేను రెడ్డి కాదు, కాపు: విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి. ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన. నిన్న విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పదవ తరగతి మార్కుల లిస్టులో కాపు అని ఉందన్నారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే విజయసాయి రెడ్డి ఆ కార్యక్రమం రావడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ముత్తంశెట్టి విజయసాయిరెడ్డి ఆ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇది ఏ మాత్రం కాపులకు ఇష్టం లేదు. ఆయన అలా వెళ్ళిందే మంత్రిని చుట్టుముట్టారు కాపులు. మన కార్యక్రమానికి ఆయన్ను ఎలా తీసుకువస్తారంటూ ప్రశ్నించారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం కాపుల సమావేశంలో అలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.