శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2019 (18:10 IST)

చూడండి ఈ యువకులు ఏం చేశారో... సీఎం జగన్ చూస్తే?(Video)

విశాఖ జిల్లా ఏజెన్సీలో వరద కష్టాలు గిరిజనుల జీవితాలను దుర్భరంగా మార్చేశాయి. నిత్యావసరాల కోసం ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది. జి.మాడుగుల మండలంలో కొండ కాలువలు ఉధృతికి అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
 
ఏవోబీలోని పలు ఊళ్ళకు రాకపోకలు ఆగిపోవడంతో మందు బిళ్ళలు కావాలన్నా కష్టాలు తప్పడం లేదు. కిల్లంకోట దగ్గర కొందరు యువకులు వరదను దాటేందుకు చేసిన సాహసకృత్యం అక్కడ జీవన స్థితిగతులకు అద్దంపడుతోంది. తరాలుగా వర్షాకాలంలో ఈ కష్టాలు అలవాటే అయినా మా జీవితాలు మారేది ఎప్పుడని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.