1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
  4. Weekend special-Dosa non veg gravy

వీకెండ్ స్పెషల్ : దోసె నాన్‌వెజ్ గ్రేవీ!

Weekend special
ఈ వీకెండ్ స్పెషల్‌గా.. నాన్ వెజ్ గ్రేవీతో హాట్ హాట్ దోసెలను టేస్ట్ చేయండి. నాన్‌వెజ్ గ్రేవీ ఎలా చేయాలంటే..?
 
కావలసిన పదార్థాలు :
ఉప్పు చేపలు - అరకిలో, దోసకాయలు - అరకిలో, పచ్చిమిర్చి - ఐదు, అల్లం - చిన్న ముక్క, ఉల్లిపాయలు - మూడు, కారం - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.  
 
తయారీ విధానం : 
ముందుగా ఉప్పు చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. దీనితో పాటు ఉల్లి, పచ్చిమిర్చి, దోసకాయలను కూడా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓ బాణాలిలో నూనె పోసి వేడయ్యాక చేప ముక్కలను వేసి వేయించండి. 
 
బంగారురంగులోకి వచ్చాక, ఇందులో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించండి. ఇవన్నీ వేగాక తగినంత ఉప్పు, కారాలను వేసి గ్లాసుడు నీళ్లు పోసి  ఉడికించాలి. చేపలు ఉడికాక, చివరగా కొత్తిమీర తురుమును పైన జల్లి సర్వ్ చేయండి.
About Writer
Selvi