1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iran Rained Drones On Major US Base. It Made America Rethink Its War Strategy

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ ఆపరేషన్

us iran war
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు మొదలయ్యాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో గత రెండు రోజులుగా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్‌ నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా దాడి చేయగా అగ్రరాజ్య సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. కువైట్‌, బహ్రెయిన్‌లోని స్థావరాలపై నౌక, వైమానిక దళాలు మిస్సైల్‌, డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించాయని ఐఆర్‌జీసీ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది.
 
రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని తొలుత ఇరాన్ ఉల్లంఘించిందని, కార్గో షిప్‌పై దాడులు చేసిందని అమెరికా ఆరోపించింది. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్ స్థావరాలు, నిల్వ కేంద్రాలపై దాడులు చేశామని చెప్తోంది. అయితే కార్గో షిప్‌పై దాడిని అమెరికా ఒక సాకుగా చూపి, పశ్చిమాసియాలో పరిస్థితులను దిగజార్చుతోందని ఐఆర్‌జీసీ నిందిస్తోంది.
 
కాల్పుల విరమణను అమెరికానే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఇదే కొనసాగితే.. పూర్తిస్థాయి ఒప్పందం కోసం జరుగుతోన్న దౌత్య ప్రయత్నాలు అన్నీ నిలిచిపోతాయని హెచ్చరించింది. ఎలాంటి దురాక్రమణకైనా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని తన ప్రకటనలో పేర్కొంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. లైంగిక సేవల పేరుతో స్పెషల్ వీడియో - కేసు నమోదు