1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Gold declined over 4 pc this week over stronger US dollar

బలపడిన డాలర్.. తగ్గిన బంగారం ధరలు

Gold Jewelry
అమెరికా డాలర్ బలపడటం, అక్కడి వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు కొనసాగుతుండటంతో, ఈ వారంలో బంగారం ధరలు 4.63 శాతం తగ్గాయి. వరుసగా నాలుగవ వారం కూడా ధరలు తగ్గడం గమనార్హం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, శుక్రవారం నాడు బంగారం ఫ్యూచర్స్ (ఆగస్టు) 0.75 శాతం పెరిగాయి. 
 
అలాగే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తక్షణ ఆందోళనలను అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గించడంతో వెండి ఫ్యూచర్స్ (జూలై) 1 శాతానికి పైగా ఎగబాకాయి. ప్రస్తుతం, బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,44,199 వద్ద, వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ. 2,22,100 వద్ద ఉన్నాయి.
 
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, సోమవారం మార్కెట్ ప్రారంభంలో రూ. 1,46,664గా ఉన్న 24-క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర, గురువారం నాటికి రూ. 1,39,878కి తగ్గింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
బీజేపీ పాలిత ప్రభుత్వంలో మరో రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్