1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Your Weekly Horoscopes: June 14-06-2026 to 20-06-2026

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

Weekly Horoscope
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్మీయుల సాయం అందిస్తారు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. చేస్తున్న పనుల పట్ల ఏకాగ్రత వహించండి. అనవసర విషయాల జోలికి పోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. రావలసిన ధనం అందుకుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రతింపులు జరుపుతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సాహసకృత్యాలకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ సహనమే మీకు శ్రీ రామ రక్ష. ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు ప్రతికూలతలు నిదానంగా తొలగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళవారం వారు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పునుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ప్రియతముల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం జాగ్రత్త, సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విధుల పట్ల అలక్ష్యం తగదు. అధికారులకు హోదా మార్పు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఒత్తిడికి గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బుధవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఖర్చులు విపరీతం డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త, ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. వ్యాపారులకు కొత్త సమస్య ఎదురవుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని విధాలా యోగదాయకం. మీ మాటకు తగిన ప్రాధాన్యం లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆలయాలను విరాళాలు అందిస్తారు. శుక్రవారం నాడు ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్తయత్నాలు చేపడతారు. కీలక పత్రాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన బదిలీ. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మొండిగా యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంస్థలు, పరిశ్రమల స్థాపనకు తరుణం కాదు. సన్నిహితుల సలహా పాటించండి. మోహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు, వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యానికి చేరువలో ఉన్నారు. పట్టుదలతో యత్నాలు సాగించండి, సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గురువారం నాడు ఆచితూచి అడుగేయాలి. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు జాగ్రత్త, దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. అస్వస్థతకు గురవుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు నిరుత్సాహకరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూలతలు అంతంతమాత్రమే. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శనివారం నాడు పనుల ప్రారంభానికి ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య అకారణ కలహం, సౌమ్యంగా మెలగండి. అప్పులు తగ్గించుకుంటారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు ఇస్తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, వివాదాలు పరిష్కారమవుతాయి.
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు, చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికం ప్రయోజనకరం. పొదుపు ధనం గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అయిన వారితో సంతోషంగా కాలం గడుపుతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదానూర్పు, వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిగిరావు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక లేక సందిగ్ధానికి లోనవుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందిరితోను మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ సేకరణను కొందరు యత్నిస్తారు. సన్నిహితుల సలహా పాటించండి. అంతరంగిక విషయాలు వెల్లడించవచ్చు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపుల స్థలమార్పు అనివార్యం, ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. అధికారులకు హోదా మార్పు. దూర ప్రయాణం తలపెడతారు.  
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు వివరీతంగా ఖర్చుచేస్తారు. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం, ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధి, వస్తుప్రాప్తి. ప్రశాంతత పొందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు. నేడు అనుకూలించని విషయం రేపు సాధ్యమవుతుంది. గురువారం నాడు  బాధ్యతలు చేపడతారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత అకాలభోజనం, దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం పొందుతారు. వృత్తిపరమైన సమస్యలు తొలగుతాయి.
About Writer
పి.ప్రసూనా రామన్