కొలరాడోలో నాట్స్ చెస్ టోర్నమెంట్ చక్కటి స్పందన
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తాజాగా కొలరాడోలో తెలుగు విద్యార్దుల కోసం చదరంగం పోటీలు నిర్వహించింది. కొలరాడో చాప్టర్ ఆధ్వర్యంలో 'నాట్స్ కొలరాడో చెస్ కాంపిటీషన్ 2026 పేరిట నిర్వహించిన ఈ చదరంగ పోటీలకు మంచి స్పందన లభించింది. స్థానిక లోన్ ట్రీ సివిక్ సెంటర్‌లో జరిగిన ఈ పోటీల్లో స్థానిక విద్యార్థులు తమ వ్యూహాత్మక ఆలోచనా విధానాన్ని, ఉన్నతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదికగా మారింది.
టోర్నమెంట్‌లో ప్రతి రౌండ్ ఎంతో ఉత్కంఠగా, తీవ్రమైన పోటీతో సాగింది. విభాగాల వారీగా జరిగిన ఈ పోటీలలో గ్రేడ్ K–3 విభాగంలో దిత్వి వేగవంతమైన కాయిన్ డెవలప్‌మెంట్, పక్కా ప్లానింగ్‌తో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, చివరి నిమిషం వరకు ప్రతిఘటించిన హంషిక ద్వితీయ స్థానంలో, స్రింక తృతీయ స్థానంలో నిలిచారు.
గ్రేడ్ 4–7 విభాగంలో మిడ్-గేమ్‌లో అద్భుతమైన వ్యూహాలతో మిత్ర ఎస్ విజేతగా నిలవగా, క్లాక్ ప్రెజర్‌ను తట్టుకుని డిఫెన్సివ్ గేమ్‌తో పవన్ స్రీతేజ ద్వితీయ స్థానాన్ని, ఎండ్-గేమ్‌లో పదునైన ఎత్తులతో శ్రియాన్ష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అత్యంత ఉత్కంఠగా సాగిన గ్రేడ్ 8–12 విభాగంలో ఆధునిక ఓపెనింగ్ వ్యూహాలతో నాగ శైలేష్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నీ ఛాంపియన్‌గా నిలవగా, క్లిష్టమైన అటాక్స్‌ను తిప్పికొట్టి ఆశ్రిత్ ద్వితీయ స్థానాన్ని, ఎండ్-గేమ్ పొజిషన్స్‌ను పక్కాగా అంచనా వేస్తూ అర్జున్ తృతీయ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ పోటీలు కేవలం చదరంగం బోర్డుకే పరిమితం కాలేదు. స్థానిక కొలరాడో తెలుగు వారి మధ్య ఐక్యతను పెంపొందించే చక్కటి వేదికగా మారాయి. సాంస్కృతిక పరిరక్షణ, యువత సాధికారతే లక్ష్యంగా ఏర్పడిన నాట్స్ కొలరాడో చాప్టర్, ఈ కార్యక్రమంతో స్థానిక తెలుగు వారిని ఒకే వేదికపైకి తెచ్చింది. మ్యాచ్‌లకు మధ్య దొరికిన విరామ సమయంలో తల్లిదండ్రులు, కోచ్‌లు, కమ్యూనిటీ నాయకులు కలుసుకొని ముచ్చటించుకుంటూ ఆత్మీయ అనుబంధాలను బలపరుచుకున్నారు. చెస్ క్రీడ పిల్లల్లో విమర్శనాత్మక ఆలోచనను, ఓర్పును, క్లిష్ట సమయంలో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందిస్తుందని నాట్స్ నాయకులు అన్నారు. లోన్ ట్రీలో తెలుగు పిల్లల ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు.
అనుదీప్ ఆర్ల నాట్స్ వైస్-ప్రెసిడెంట్ ( ఫైనాన్స్/మార్కెటింగ్), కొలరాడో చాప్టర్ కోఆర్డినేటర్స్: మంజుల కుంటముక్కల, ప్రత్యూష అప్పరసు; జనసుధ (స్పోర్ట్ చైర్), సత్యజీ చిగురుపాటి (కోశాధికారి), సాయి చరణ్ (సోషల్ మీడియా) , జ్యోత్స్న గుంటూరు, దివ్య చంద్రిక మరియు సాయి కృష్ణ వంటి కోర్ సభ్యుల సహకారం తో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకునేల జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటి ఘన విజయం సాధించడానికి సహకరించిన నాట్స్ వాలంటీర్ల కు, నాట్స్ నాయకులకు పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు నాట్స్ కొలరాడో చాప్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కొలరాడోలో నాట్స్ చెస్ టోర్నమెంట్‌ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ అభినందించారు.
