సంబంధిత వార్తలు
- ఆస్తి అంతస్తు వున్నాయి, కానీ పిల్లల్లేరు, ఏం చేయాలి?
- నవగ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే...? చర్మంతో చేసిన మనిపర్సులను..?
- కొబ్బరి దీపం వెలిగిస్తున్నారా? నేతిని మాత్రమే వాడాలట!
- శని ప్రభావం నుంచి గట్టెక్కాలంటే..? రావి చెట్టు కింద నువ్వుల దీపం.. 51 వారాలు?
- రోజూ ఇలా చేస్తే రోగాలు దరి చేరవు.. ధన్వంతరీని శుక్రవారం పూజిస్తే?
స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే.. భర్త తాగి వచ్చి కయ్యానికి దిగితే..?
Bangles
సంపదలను, ఎక్కువగా ప్రదర్శించడం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం, సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి… వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.
భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడరును ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది. మొదట దీనిని తాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటు చేయండి. ఇలా చేస్తే వారు తాగుడు దూరంగా వుంటారు.
మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి. భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా, విజయం సంతోషం వెంట ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
తర్వాతి కథనం
