సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

రోజూ ఇలా చేస్తే రోగాలు దరి చేరవు.. ధన్వంతరీని శుక్రవారం పూజిస్తే?

Dhanvantri
ధన్వంతరీని శుక్రవారం పూజిస్తే అనారోగ్య సమస్యలంటూ వుండవు. అనారోగ్యాన్ని దూరం చేయడానికి.. ధన్వంతరి అష్ణోత్తర శతనామ అర్చన సత్ఫలితాలనిస్తుంది. అలాగే ప్రతిరోజూ నీరు ఎక్కువగా సేవించడం, గాలి ఎక్కువగా పీల్చుకోవడం వంటివి చేయాలి. 
 
అలాగే మనస్సును ప్రశాంతంగా వుంచుకోవాలి. మితంగా సాత్వికాహారం తీసుకోవడం చేయాలి. ప్రతిరోజు ఉదయించే సూర్యుని ముందు నిల్చొని, ఆదిత్య హృదయం చదవాలి. శాస్త్ర పద్ధతిలో సూర్య నమస్కారాలు కూడా చేస్తే మంచిది. వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని.. 59వ సర్గ పారాయణం చెయ్యాలి. ఇది మనలోని అహంకారాన్ని అంతః శత్రువులను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. 
 
నవగ్రహాలకు అధిపతి శ్రీ సుదర్శనులవారు. భగవంతుని సంకల్పానుసారం వారు నడుస్తారు. మన కర్మ ఫలాలను, ప్రధానంగా అనారోగ్యములను నియంత్రించే ఆదేశాలను భగవంతుడు నరసింహ దివ్యరూపంలో సుదర్శనుల వారికి కటాక్షిస్తాడని ప్రసిద్ధి. 
 
అందువల్ల వారికి ప్రీతి కలిగించే విధంగా శుక్రవారం సుదర్శన శతకం, సుదర్శనాష్టకం, నృసింహాష్టకం, లక్ష్మీనరసింహ అష్ణోత్తర శతనామావళి పారాయణం అర్చన చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.