1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Spiritual Remedies for Good Wealth

ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలట.. ఉప్పును కాళ్లతో..?

Spiritual Remedies
Milk
ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల ధననష్టం. అంతేకాదు.. పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. అలాగే  అరటిపండును తినగానే మజ్జిగ తీసుకోకూడదు. నదీ, సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే వీపును తుడుచుకోవాలి.
 
శరీరంలో అన్ని భాగాలకంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది. అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు. రాత్రిపూట చంద్రుడిని, నక్షత్రాలను కొద్ది చూస్తే కంటి దృష్టి శక్తి పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. 
 
ఇంకా ఉప్పును కాళ్లతో తొక్కకూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు.  అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఉప్పు శనీశ్వరుని సంకేతం. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరుడి అంశగానూ, యమధర్మరాజు సంకేతంగా చెప్పేవారు. 
 
అలా చెప్పడం వల్ల ఉప్పును చేబదులు అడిగే వారు కాదు. తస్కరించే వారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవడం ఉత్తమమైన మార్గమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
31-03-2021 బుధవారం దినఫలాలు - గాయత్రి మాతను ఆరాధించినా...