సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 23 మార్చి 2021 (22:21 IST)

నిద్రలో మంచి స్వప్నం, చెడు స్వప్నం, ఏంటవి?

నిద్రించేటపుడు కొన్ని స్వప్నాలు వస్తుంటాయి. మేడలు, పర్వతాలు, ఫల వృక్షాలు, రథము, గుర్రము, ఏనుగులను చూచుట, ఎక్కుటం, ప్రభువు, బంగారం, ఎద్దు, ఆవు, పండ్లు, పూలు, గోక్షీరము, గోఘృతము, కన్య, వేశ్య, రత్నములు, ముత్యములు, శంఖము, దేవతా విగ్రహాలు, చందనము, పుణ్యస్థలాలు చూచుట, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, భక్ష్యములను భక్షించుట, పీతాంబరమును ధరించుట, ఆభరణము ధరించుట, జయములను పొందుట మొదలైనవి శుభ స్వప్నములు, ఇవి శుభాలనిస్తాయి.
 
దుస్వప్నములు.. చెడు కలలు విషయానికి వస్తే... సర్పము, దున్నపోతు, నూనె, ఆముదము, బురదలో దిగుట, సముద్రంలో దిగుట, బండి నుంచి కిందపడటం, మృత వార్త వినడం, ఖైదు పడటం, వైద్యుని చూడటం, విధవను చూడటం, క్షౌరము చేయించుకోవడం, ముళ్ల పొదల్లో పడటం, తన గొంతుకు ఉరి వేస్తున్నట్లుగా కనబడటం, తన చేతిలో ఫలములు ఇతరులు లాక్కోవడం, తనను కొట్టడం, గాడిదను ఎక్కడం, దున్నపోతును ఎక్కడం, కాకిని చూడటం మొదలైనవి చెడ్డవి.
 
రాత్రి 1వ జాములో వచ్చిన కల ఏడాదికి, 2వ జాములో వచ్చినది 6 నెలలకి, 3వ జాములో వచ్చిన కల నెలరోజూల్లోనూ, 4వ జాములో వచ్చిన కల త్వరగాను ఫలిస్తాయి. పగటిపూట నిద్రించినపుడు వచ్చే స్వప్నములకు, పైత్యము, అజీర్ణము, వాత దోషం వల్ల వచ్చే కలలకు ఫలితాలుండవు. దుస్వప్నములు వచ్చినపుడు లేచి తలస్నానం చేసి శివుడి ఎదుట దీపము వుంచి ప్రార్థించాలి. మంచి కల వచ్చినప్పుడు మెలకువ వస్తే తిరిగి నిద్రపోకూడదని శాస్త్ర వచనం.