మంచి శకునములు-దుశ్శకునములు.. శుభ స్వప్నాలు కొన్ని మీ కోసం..? (video)
moon
ఇక దుశ్శకునాల సంగతికి వస్తే.. పిచ్చివాడు, ఒంటి బ్రాహ్మణుడు, చెవిటి, కుంటి, జడదారి, మూలికలు, ఎముకలు, చర్మము, నూనె, ప్రత్తి, కట్టెలు, ఉప్పు, బెల్లము, మజ్జిగ, పాము, దిగంబరుడు, క్షౌరం చేయించుకున్నవాడు, తల విరబోసుకున్న వాడు, దీర్ఘ రోగి వంటి వారు ప్రయాణ సమయంలో ఎదురైతే చెడు ఫలితాలు ఖాయమని..తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అలాగే శుభ స్వప్నాలు కొన్ని మీ కోసం.. సూర్యోదయం, పూర్ణ చంద్రోదయం కలలో కనిపిస్తే ధనలాభం కలుగుతుంది. క్షేత్రదర్శనం, గురువులు, పుణ్యపురుషులను పూజించినట్లు కలవచ్చినట్లైతే శుభం. సంపద కలుగుతుది. నీటిమీద తిరిగినట్లు కలవస్తే శుభం. పూలతోటలో తిరిగినట్లు వచ్చినట్లు స్త్రీ వలన లాభము. పచ్చని పైరు ధనలాభము. వివాహము జరిగినట్లు కానీ, ఏనుగు మీద ప్రయాణం చేసినట్లుగానీ కల వచ్చినట్లైతే.. ధనలాభము కలుగును.
తర్వాతి కథనం
