మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (08:10 IST)

17-03-2021 బుధవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరిని పూజించినా... (video)

మేషం : ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. ప్రభుత్వనుదు పనిచేయు ఉద్యోగులకు లాభములు చేకూరును. స్థిర, బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
వృషభం : కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. 
 
మిథునం : ఉన్నతస్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మిత్రులను కలుసుకుంటారు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యంకాదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలకు ఆరోగ్యపరంగాను ఇతరాత్రా చికాకులు వంటివి ఎదుర్కొంటారు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదిది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం : ఆర్థికంగా మెరుగుపడుతారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రేమకులకు తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీసిత్యా. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. 
 
కన్య : ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు ఎదురవుతాయి. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఇన్వర్టర్, ఏసీ వ్యాపారస్తులకు శుభదాకయంగా ఉంటుంది. 
 
తుల : ఉద్యోగస్తులకు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. మీ  భర్త మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాల స్టాకిస్టులకు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. 
 
వృశ్చికం : బహిరంగ సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత జ్ఞాపకాలు గురించి మీ మిత్రులతో చర్చిండంలో ఉల్లాసాన్ని పాలుపంచుకుంటారు. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులు కలిసిరాగలదు. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మకరం : ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనులు లాభదాయకం. ఇతరులు మీ పట్ల ఆకర్షితులవుతారు. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
కుంభం : స్త్రీల ఆంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పదు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మీనం : ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బంది పడతారు. అనుకోని ఖర్చులు ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి.