శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-03-2021 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించినా...

మేషం : మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దీర్ఘకాలికంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తివతాయి. స్త్రీలకు ఏ విషయంలోనూ ఆసక్తి పెద్దగా ఉండదు.
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు.
 
మిథునం : రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట తప్పవు. వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయడం ఎంతైనా అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల సమర్థత, వినయం అధికారులను ఆకట్టుకుంటాయి.
 
కర్కాటకం : స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైద్యులు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనువు కాని చోట ఆధిపత్యం చెలాయించడం మంచిదికాదు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు. 
 
సింహం : మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచాయలేర్పడతాయి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుకుంటాయి. మీ అవసరాలు కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విదేశాలకు వెళ్లడానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. 
 
కన్య : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ గౌరవ ఆత్మాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. స్త్రీలకు బంధు వర్గాల ఆదరణ సహాయ సహకారాలు లభిస్తాయి. అధిక ఆదాయం కొరకు అధికంగా శ్రమపడవలసి వస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. 
 
తుల : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ అవసరాలకు కావలసిన ధనం ఆకస్మికంగా అందుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
వృశ్చికం : ఉమ్మడి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూల, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. 
 
ధనస్సు : స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. సంఘంలో మీకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాజకీయ నాయకులు విరోధులు వేసే పథకాలు తెలిపితో తిప్పిగొట్టగలుగుతారు.
 
మకరం : పాత బాకీలు వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలోనూ, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ వహించండి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. 
 
కుంభం : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రియతముల రాక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. 
 
మీనం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉన్నతంగా ఎదుగలానే మీ లక్ష్యానికి చేరువవుతాయి. బంధు మిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.