మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-03-2021 గురువారం దినఫలాలు - శివారాధన వల్ల సర్వదా శుభం

మేషం : అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. వ్యాపారాల అభివృద్ధికి స్కీములు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే లాభిస్తాయి. పనులు హడావుడిగా ముగిస్తారు. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు ప్రభావం అధికం. వాహనం వేగంగా నడపడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కోల్పోయిన పత్రాలు తిరిగి సంపాదించుకుంటారు.
 
మిథునం : బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను అధికమించి అనుభవం గడిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇరకాటంలో పడే ఆస్కారం ఉంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఉద్యోగస్తులు దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
కర్కాటకం : ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అయినవారితోనైనా ఎలాంటి వ్యవహారంలోనూ మొహమ్మాటం వద్దు. 
 
సింహం : బంధువుల రాక వల్ల పనులు అర్థాంతరంగా ముగించవలసి వస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, అవకాశాలు కలిసివస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. 
 
కన్య :  సన్నిహితుల ఆపత్సమయంలో ఆదుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలకు ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగవు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. 
 
తుల : ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ, వ్యపారులకు అధికారుల నుంచి ఒ్తత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : విదేశీయత్నాలకు మార్గం సుగమమవుతుంది. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి తప్పదు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులలు వేయండి. క్రయ, విక్రయాల విషయంలో శ్రేయోభిలాషుల సలహా పాటించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. 
 
ధనస్సు : ఆర్థిక విషయాల్లో కొత్త పురోగతి సాధిస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు అవసరం. కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మకరం : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ సంతానం వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
కుంభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోగలవు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటాయి. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. రావలసిన ఆదాయంపై దృష్టిసారిస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. 
 
మీనం : సంస్థలో సభ్యత్వం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తారు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి పదోన్నతి, స్థాన చలనం వంటి మార్పులు సంభవం. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయలు నెలకొంటాయి.