ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-03-2021 శనివారం దినఫలాలు - వేంకటేశ్వరస్వామిని ఆరాధించినా...

మేషం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ లేకపోయినా సంతృప్తికానరాదు. కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, గృహోపకరణ వ్యాపారాలు పురోభివృద్ధి పొందుతారు. హోటల్, తినుబండరాలు, బేకరీ పనివారలకు లాభదాయకం. స్త్రీలు వాదోపవాదాలకు దిగడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. 
 
వృషభం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, పనివారలతో సమస్యలు ఎదుర్కోక తప్పదు. పెద్దల ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. సిమెంట్, ఐరన్, కలప, ఇటుకవ వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలవు. హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. 
 
కర్కాటకం : కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగులు పైఅధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికంగా ఉంటాయి. 
 
సింహం : బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రయాణాలలో మెళకువ అవసరం. వైద్యులకు ఆపరేషన్ల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలతలు ఎదురవుతాయి. వివాదాస్పద వ్యవహారాలు సమర్థంగా పరిష్కరిస్తారు. 
 
కన్య : వృత్తి వ్యాపారులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పత్రికా రంగంలోని వారి ఏమరుపాటుతనం వల్ల చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువర్గాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.  
 
తుల : కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఏమాత్రం అనుకూలించవు. వాహన నడుపునడు జాగ్రత్త అవసరం. విద్యార్థుల్లో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలించవు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిహిత్యం కోరుకుంటారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. 
 
ధనస్సు : చేతి వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రుణ యత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది. దంపతుల సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొంతమంది మాటతీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది. 
 
మకరం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం : ఒక కార్యార్థమై దూర ప్రయాణం చేయవలసివస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. ఉమ్మడి వ్యాపారస్తులకు వ్యాపారంలో మెళకువ అవసరం. 
 
మీనం : స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దంపతుల మధ్య చికాకులు తలెత్తగలవు. ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్తలు వహించండి. తలపెట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తిచేస్తారు.