బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-03-2021 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే...

మేషం : కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహయం అర్థించవచ్చు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికం అవుతున్నారని గమనించండి. రచయితలు, పత్రికా రంగం, ప్రైవేటు సంస్థలలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్ల సమస్యలకు లోనవుతారు. 
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకుల తలెత్తినా నెమ్మెదిగా సమసిపోతాయి. స్త్రీలకు ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారిలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో అధికమైన జాగ్రత్త అవసరం. 
 
మిథునం : కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఆపద సమయంలో సన్నిహితుల అండగా నిలుస్తారు. 
 
కర్కాటకం : కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు తోటివారితో సంయమనంతో మెలగలసి ఉంటుంది. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. మధ్యవర్తిత్వం వహించడం వల్ల గుర్తింపు పొందుతారు. 
 
సింహం : ఆర్థిక లావాదేవీలు, ఇతరాత్రా ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించకపోవడంతో ఆందోళన గురవుతారు. ఊహించని ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతాయి. 
 
కన్య : మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఉమ్మడి వ్యాపారస్తులకు పరస్పర అవగాహనలోపం వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొంతమంది మిమ్మలను తప్పుదోవ పట్టించేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. 
 
తుల : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు అశాజనకం. ముఖ్యులతో అత్యంత సన్నిహితంగా మెలగడం వల్ల లబ్ది చేకూరే అవకాశం ఉంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తికానరాదు. స్త్రీలు తెలియని అశాంతికి గురవుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయాన ప్రయాణానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో కీలకమైన విషయాలు చర్చలు జరుపుతారు. 
 
ధనస్సు : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం, నిర్లప్తత విడనాడిన సత్ఫలితాలు సాధిస్తారు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. మిత్రులను కలుసుకుంటారు. ఆడిటర్లకు, వైద్య రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మకరం : అనుకున్న పనులు సకాలంలో పూర్తికావడంతో మానసిక సంతృప్తి పొందుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదపడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ధనం ఎంత వస్తున్నా నిల్వ చేయలేకపోతారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరంటే గిట్టనివారు మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
కుంభం : మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకోలగుతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీరు చేసే పనులకు బంధువుల నుంచి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఇతరుల విషయాలకు, వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
మీనం : ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. బంధువులు మీ స్థోమతకు తగిన వివాహ సమచారం అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు అలంకారపు వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు.