మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-03-2021 మంగళవారం దినఫలాలు - దత్తాత్రేయుడుని పూజించినా...

మేషం : బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. 
 
వృషభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. సోదరీ, సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ఉపాధ్యాయులకు బదిలీ వార్త ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 
 
మిథునం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా, బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. 
 
కర్కాటకం : మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాల్లో కొంత పురోగతి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. 
 
సింహం : ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. సంఘంలో మీ మాటకు అంత గుర్తింపు లభించదు. 
 
కన్య : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బంధువుల నుంచి రావలసిన ధనం అందుకుంటారు. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు పనులు మందకొడిగాసాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. 
 
తుల : అకాల భోజనం, శారీరకశ్రమ వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సహం లభిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. 
 
వృశ్చికం : రుణం పూర్తిగా తీర్చి తాకట్లను విడిపించుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. వ్యాపకాలు విస్తరిస్తాయి. సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగాసాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
ధనస్సు : బంధు మిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. సేవా సంస్థల్లో సభ్యత్వం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వృత్తులలో వారి శ్రమకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మకరం : ఆడిటర్లు, అకౌంట్స్, ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఆపరేషన్లసమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీ శ్రీమతికి మీరెంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
కుంభం : చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతంగా భావించకండి. షాపు గుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం. విందు భోజనం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధవహించండి. 
 
మీనం : రవాణా రంగాలలోని వారికి లాభదాయకం. గతంలోవాయిదాపడిన పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల కొనుగోలు దిశగా ఆలోచనలు సాగిస్తారు. శత్రువులు, మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.