గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

జీతం రాగానే ఆ డబ్బుతో ఏం చేయాలంటే? వేణువుతో కూడిన కృష్ణుడు..?

దేవాలయంలో పూజించే విధంగా కానీ, గుడిలో గానీ వేణువు వున్న కృష్ణుడు వుండాలి. గృహంలో వేణువు వూదుతున్నట్లు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు. ఆవుతో వున్న కృష్ణుడు ఇంట్లో వుండటం మంచిది. తులసి చెట్టు ఆకులను గోటితో గిల్లకూడదు. ఆడవారు అసలు తులసీ ఆకులను కోయకూడదు. పొద్దుపోయాక తులసీ చెట్టుకు నీరు పోయకూడదు. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు వుండకూడదు. 
 
ఇంటి ముంగిట తమలపాకు చెట్టు వుంచకూడదు. తమలపాకును తోటలోనే వుంచాలి. శనివారం నలుపు వస్త్రాలను ఇంటికి తీసుకురాకండి. వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు. కొంచెం దూరంగా వదలటం చేయాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. అలా చేస్తే ధనలక్ష్మి ఇంట్లో నిలుస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.