గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (18:36 IST)

కరోనా సోకకుండా వుండాలంటే.. ఖాళీ కడుపుతో ఉండకూడదట..!

కరోనా సోకకుండా వుండాలంటే.. ఖాళీ కడుపుతో ఉండకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా వుండాలంటే.. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ఉపవాసాలకు దూరంగా వుండాలి. రోజూ సూర్యోదయం సమయంలో గంట సేపైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వుండాలి. ఏసీ ఎక్కువ వాడకూడదు. కూరల్లో అల్లం తప్పకవాడాలి. 
 
పిల్లలు పెద్దలు రాత్రి నిద్రించే సమయంలో పసుపు కలిపిన పాలు తాగడం మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేనె నిమ్మరసం తప్పకుండా తీసుకోవాలి. ఇంట్లో లవంగాలు, కర్పూరం, సాంబ్రాణి ధూపం మరిచిపోకూడదు. లవంగం టీని సేవించడం, నారింజ పండ్లను తీసుకోవడం, ఉసిరిని తీసుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.