గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (18:04 IST)

బీఆర్కేభవన్‌లో కరోనా కలకలం.. కోవిడ్‌‌ వచ్చినా గోప్యంగా వుంచి..?

నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వారందరూ తమకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆఫీసుకు వచ్చారు. దాంతో బీఆర్కేభవన్‌లో గత వారం రోజుల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మిగతా సిబ్బంది, ఉద్యోగులు భయాందోళనకు లోనవుతున్నారు. 
 
తమకు కరోనా సోకుతుందన్న భయంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కాగా.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవండ వల్లే బీఆర్‌కేఆర్‌ భవన్‌లో కరోనా కేసులు పెరగుతున్నట్లు తెలుస్తోంది.