గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (11:39 IST)

ఇర్ఫాన్‌ పఠాన్‌‌కి కోవిడ్ పాజిటివ్.. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడిన వాళ్లకే..?

దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ప్రకటించాడు. 
 
లక్షణాలు లేకున్నా... పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 
 
కాగా.. ఇటీవల రాయ్‌పూర్‌లో ముగిసిన రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే కరోనా సోకుతోంది. ఇప్పటికే ఈ సిరిస్‌లో ఆడిన సచిన్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా పాల్గొనడం విశేషం.