శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (19:24 IST)

సూపర్ స్టార్ సినిమాకు కరోనా కాటు.. క్వారంటైన్‌లోకి రజనీ కాంత్ (video)

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా షూటింగ్‌లో కరోనా కలకలం రేగింది. ప్రస్తుతం రజనీ 'అన్నాత్తే' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు. 
 
ఇందుకు కారణం చిత్ర బృందంలో దాదాపు ఎనిమిది మంది కరోనా బారిన పడటమే. దీంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వారిలో ఒకరు హీరో రజనీకి క్లోజ్‌ అని తేలింది. దాంతో రజనీ హోం క్వారంటైన్ నిబంధనలు పాటించనున్నారు. అయితే గత వారం తమ నూతన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. 
 
ఈ సినిమాను త్వరగా రూపొందించాలని చూస్తున్నారు. దానికి కారణం రజనీ కొత్తగా పెట్టిన సొంత పార్టీతో ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. దాంతో అన్నాత్తే చిత్ర యూనిట్ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేసేందుకు కాలంతో పోటీపడుతూ పరుగులు పెడుతోంది. దాంతో ఎన్నికల కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. ఇటువంటి సమయంలో ఈ సంఘటన జరగడం పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు బాగానే ఉన్నాయి. 
 
ఇదిలా ఉంటే ఈ సినిమా సిరుతై శివ దర్వకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో లేడీ స్టార్ హీరోయిన్ నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.