సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శని ప్రభావం నుంచి గట్టెక్కాలంటే..? రావి చెట్టు కింద నువ్వుల దీపం.. 51 వారాలు?

శని ప్రభావం వుంటే వ్యాపారంలో నష్టాలు రావడం, మానసికంగా ఒత్తిడి కలగడం లాంటివి జరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అప్పుల బాధలు తప్పవు. అలానే తినే అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎక్కువగా మాంసం మందుకి అలవాటు పడిపోతారు. అందుకే శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే..  శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం చేయాలి.
 
ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం. నల్ల రంగులో ఉండే కుక్కలకి ఆహారం ఇవ్వడం. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు శనివారం నాడు దానం చేయడం లాంటివి చేస్తే తప్పకుండా ఈ ప్రభావం తగ్గుతుంది. 51 వారాలు శనివారం ఉపవసించాలి. అలాంటప్పుడు మినపప్పుతో చేసిన వంటకాలనే తీసుకోవాలి. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
Diya
 
అలాగే నువ్వులతో చేసిన వంటకాలు, మినపప్పు చేసిన వంటకాలను దానంగా ఇవ్వవచ్చు. శనిగ్రహ శాంతి చేయించవచ్చు. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.