శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (17:30 IST)

గృహంలో వాస్తు దోషాలుంటే.. శ్రీకాళహస్తికి వెళ్ళాలట!

గృహంలో వాస్తు దోషాలున్నాయా? ఆదాయం అందట్లేదా..? వాస్తు ఇక్కట్లతో ఇబ్బందులు తప్పట్లేదా? అయితే ఇలా చేయండి అంటున్నారు.. వాస్తు నిపుణులు. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే.. శ్రీ కాళహస్తీశ్వరాలయానికి చేరి.. స్వామిని దర్శించుకోవాలి. అక్కడ జరిగే రాహు దోష పూజలు చేయించడం మంచిది. శుక్రవారాల్లో దుర్గాదేవికి నిమ్మకాయ ద్వారా దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
ఇలా చేస్తే ఇంట వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇంకా పౌర్ణమి రోజుల్లో శివ దర్శనంతో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అంతేగాకుండా రోజుకు 27సార్లు వాస్తు గాయత్రి పఠిస్తే.. ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గృహ ప్రవేశం ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ కార్తీక మాసాలలో చేయాలి. గృహ నిర్మాణానికి కూడా ఇవి కలిసొస్తాయి. ఈ మాసాల్లో గృహారంభము చేస్తే ధన, కనక, పుత్ర ఆరోగ్యములు వృద్ధి చెందుతాయి.