సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

సర్పశాపం వుందంటే.. మంగళవారం కుమార స్వామికి..?

సర్పశాపం ఎలా వస్తుందంటే కొందరు నాగుపాములను చంపుతుంటారు. నాగుపాములను చంపకూడదు. కొందరు పుట్టలు తొలగించి ఇళ్ళు కట్టడం వగైరా చేస్తారు. ఇలా తెలిసీ, తెలియక పుట్టల సమీపంలో మూత విసర్జన చేసినా.. రుతు సమయంలో మైల బట్టలు పాములు దాటినా ఈ శాపాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలా సర్పదోషాలతో వివాహంలో అడ్డంకులు, సంతానం కలుగకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే మంగళవారం పూట పాము పుట్టలో పాలు పోయడం.. కుమార స్వామికి పాలాభిషేకం చేయించడం వంటివి చేయాలి. 
 
అలాగే రుషి రుణం ఎలా తీర్చుకోవాలంటే.. రుషులు, సిద్ధులు లోక సంక్షేమం కోసం తపస్సు చేసే వారు. వారికి ఎలాంటి హాని తెలిసిగానీ తెలియక కానీ కలిగించకూడదు. దేవశాపం కూడా అలాంటిదే. గుడికి ఏ విధమైన హాని తలపెట్టినా ఆలయంలోని వస్తువులను గానీ ధనాన్ని గానీ అపహరించినా దైవ శాపం తప్పదు. 
 
ముఖ్యంగా మాతృశాపం చిన్న విషయం కాదు. తల్లి ఎల్లప్పుడూ శిశువు సంక్షేమం కోసం తపిస్తూవుంటుంది. అలాంటి తల్లి తన సంతానం పట్ల ఏ ద్రోహం చేసినా శపించదు. ఏ వయసులోనైనా తల్లిదండ్రులను గౌరవించాలి. కొందరు తల్లిదండ్రులను పట్టించుకోరు. అలాంటి వారు బాధాతప్త హృదయంతో ఆవేదన చెందితే.. కన్నీళ్లు పెట్టుకున్నా అది శాపంగా మారుతుంది.